Chandrababu: కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కావడం, మాపై బురద చల్లడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది: చంద్రబాబు
- వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది
- ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు పంపి రుణం రాకుండా అడ్డుకోవాలని చూశారు
- కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తప్పుడు ఫిర్యాదుల ద్వారా అడ్డుకుంటున్నారు
- కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాల్సిన బాధ్యత టీడీపీ ఎంపీలపై ఉంది
వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్‌లో తమ పార్టీ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగినా వైసీపీకి పట్టట్లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కావడం, తమపై బురద చల్లడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి వైసీపీ ఆటంకాలు సృష్టిస్తోందని, ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు పంపి రుణం రాకుండా అడ్డుకోవాలని చూశారని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తప్పుడు ఫిర్యాదుల ద్వారా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాల్సిన బాధ్యత టీడీపీ ఎంపీలపై ఉందని పేర్కొన్నారు.