Telugudesam: ఇంకా ఓపిక పడితే అసలుకే మోసం: బీజేపీపై టీడీపీ నేతలు

  • బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం
  • కేంద్రంలో భాగస్వామ్యమైనా ఏమీ లభించలేదు
  • అత్యధిక తెలుగుదేశం నేతల అభిప్రాయం ఇది

నిన్న పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉండి కూడా ఏమీ సాధించుకు రాలేదన్న అపవాదును ఇంకెంతకాలం మోయాలని ప్రశ్నిస్తున్నారు. నిన్న బడ్జెట్ తరువాత సీఎం చంద్రబాబును కలిసిన టీడీపీ నేతల్లో అత్యధికులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాజకీయ పరిణామాలపై చర్చ సాగగా, వారంతా కేంద్రంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఓపిక పడితే అసలుకే మోసం వస్తుందని, ప్రజల్లో ఇప్పటికే ఆగ్రహం పెరిగిపోయిందని వారు వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలనూ స్తంభింపజేసి, రాష్ట్ర డిమాండ్లను నెరవేర్చుకు వచ్చేలా ఎంపీలకు దిశానిర్దేశం చేయాలని కొందరు మంత్రులు చంద్రబాబును కోరినట్టు తెలిసింది. కాగా, మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతల అభిప్రాయాన్ని తీసుకుని ఓ నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News