వర్మ సినిమాలో నాగ్ తరువాత ముఖ్యమైన పాత్ర అదేనట!
- వర్మ దర్శకత్వంలో నాగ్
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజయ్
- త్వరలోనే టైటిల్ ప్రకటన
మేజర్ షెడ్యూల్ ను ముంబైలో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నాగ్ సరసన మైరా సరీన్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆయనతో పాటు అజయ్ కూడా ఓ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. నాగార్జున తరువాత ఈ సినిమాలో అజయ్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుందట. ఈ సినిమాతో అజయ్ మరింత బిజీ కావడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు