Telangana: 'సీఐ అక్రమ సంబంధం' కేసులో ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి సస్పెన్షన్!
- సునీతారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు
- డీజీపీకి నివేదిక అందజేసిన ఐజీ
- సునీతారెడ్డి వివాదాస్పద వ్యవహార సరళిపై అధికారుల మండిపాటు!
ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున్ రెడ్డిల అక్రమ సంబంధం కేసులో పోలీసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సునీతారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదికను డీజీపీకి ఐజీ స్టీఫెన్ రవీంద్ర అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఈరోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సునీతారెడ్డి వివాదాస్పద వ్యవహార సరళితో పోలీస్ శాఖ పరువుపోయిందని ఉన్నతాధికారులు మండిపడుతున్నట్టు సమాచారం.