: నా మరణంపై చింత వద్దు... కొడుకును బాగా చూసుకో: భార్యకు అఫ్జల్ లేఖ
పార్లమెంటుపై దాడి కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురును 9న ఉదయం ఉరితీశారు. అతడి చివరి కోరిక ఏంటో తెలుసా? తాను రాసిన లేఖను తన భార్యకు అందించాలని కోరాడు. 'ఈ లేఖను నా భార్యకు తప్పకుండా అందించండి' అని అభ్యర్థించాడు. చనిపోయే ముందు కాళరాత్రి తన భార్యకు రాసిన లేఖను, ఉరికంబానికి తనను తీసుకెళ్లే ముందు అఫ్జల్ తీహార్ జైలు అధికారులకు అందించాడు.
అఫ్జల్ కోరిన చివరి కోరిక ఇదేనని జైలు అధికారి ఒకరు చెప్పారు. తన మరణం గురించి చింతించవద్దని, కుమారుడిని జాగ్రత్తగా చూసుకోమని లేఖలో అఫ్జల్ తన భార్యను కోరాడని తెలిపారు. అలాగే, ధైర్యంగా ఉండాలని, కొడుకును నిరాశకు గురికాకుండా చూసుకోవాలని కోరినట్లుగా చెప్పారు. 'ఈ లేఖ అఫ్జల్ వ్యక్తిగతమైనది. దీనిని స్పీడ్ పోస్టులో ఆయన భార్యకు పంపాం. వారి కుటుంబ సభ్యులు చదివిన తర్వాత ఇష్టమైతే వారు బయటకు వెల్లడించవచ్చు' అని తీహార్ జైలు అధికారి తెలిపారు.