Chandrababu: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టు మాట్లాడుతున్నారు!: వైసీపీ నేత ఆదిశేషగిరిరావు

  • చంద్రబాబు మాటలు చూసి రైతులు నవ్వుకుంటున్నారు
  • ఈ మధ్య ఎందుకో మాటలు ‘స్లిప్’ అవుతున్నట్టుంది 
  • ఒకోసారి మాట్లాడిందే మాట్లాడుతున్న బాబు
  • విమర్శలు గుప్పించిన ఆదిశేషగిరిరావు

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు విమర్శించారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఎందుకో మాటలు ‘స్లిప్’ అవుతున్నారు. ఒకోసారి ఆయన (చంద్రబాబు) మాట్లాడిందే మాట్లాడుతున్నారు. మర్చిపోయి ఆ విధంగా మాట్లాడుతున్నారా? లేక గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఒకటికి నాలుగుసార్లు చెబుతున్నారో తెలియదు!

ఈ మధ్య మీటింగ్స్ లో ఆయన (చంద్రబాబు) మాట్లాడింది చూస్తే..మొదటి పది నిమిషాలు ఏమి మాట్లాడారో..అవే మాటలు మళ్లీ మాట్లాడుతున్నారు. రాజకీయంగా ఆయన (చంద్రబాబు)కు నలభై ఏళ్లు, ముఖ్యమంత్రిగా సుమారు పదమూడేళ్ల అనుభవం ఉంది. ఈ మధ్య కడపలో జరిగిన ‘జన్మభూమి’కి స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకొచ్చావ్? అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు. అలా మాట్లాడటం కరెక్టు కాదుగా? తాను అధికారంలోకి వచ్చాకే రైతులు పంటలేసుకుంటున్నారన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు! ఈ మాటలు చూసి రైతులు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు.

  • Loading...

More Telugu News