9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి, ఈసీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు.. వేటు వేయాలని విన్నపం
- లాభదాయక పదవుల్లో ఉన్నారు
- హైకోర్టు కూడా వీరి నియామకాలను రద్దు చేసింది
- ఆప్ ఎమ్మెల్యేల మాదిరే వీరిపై కూడా అనర్హత వేటు వేయండి
ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించారని, మిగిలినవారు లాభదాయక పదవుల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. వీరిలో వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావులను సీఎం కార్యాలయంలో సెక్రటరీలుగా నియమించారని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్, సతీష్ కుమార్ లను డిప్యూటీ సీఎం కార్యాలయాల్లో సెక్రటరీలుగా నియమించారని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధమైన పదవుల్లో ఉన్నారంటూ గతంలో హైకోర్టు కూడా వీరి నియామకాలను రద్దు చేసిందని లేఖలో పేర్కొన్నారు.