: జన్యువైద్యంలో మేలిమలుపు.. నిమిషాల్లో డీఎన్‌ఏ సేకరణ


డీఎన్‌ఏ సేకరించడం అంటే మనకు తెలిసి అది చాలా పెద్ద ప్రక్రియ. అయితే దీన్ని సులభతరం చేసి కేవలం రెండే నిమిషాల్లో డీఎన్‌ఏ సేకరించే అత్యాధునిక పరికరాన్ని కనుగొన్నారు. దీనివలన జన్యువైద్యం అనే కీలక ప్రక్రియ రూపురేఖలు మారిపోతాయని విశ్వసిస్తున్నారు.

వాషింగ్టన్‌ యూనివర్సిటీ , నానోఫ్యాక్చర్‌ అనే సంస్థ కలిసి ఈ విషయంలో ప్రయోగాలు నిర్వహింపజేశాయి. ఒక చిన్న పరికరాన్ని వారు రూపొందించారు. దీంతో రెండే నిమిషాల్లో శరీరం నుంచి డీఎన్‌ఏను వేరుచేయవచ్చు. లాలాజలం, రక్తం వంటి నమూనాల నుంచే ఇది డీఎన్‌ఏను సేకరిస్తుందని పరిశోధన బృందం నాయకుడు జే హ్యూన్‌ చంగ్‌ చెప్పారు. ప్రస్తుతం డీఎన్‌ఏ సేకరణ అనేది... ఒక వెంట్రుకను క్రేన్‌సహాయంతో సేకరిస్తున్నంత సంక్లిష్టంగా ఉన్నదని, ఎక్కువ సమయం మాత్రమే కాకుండా, ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించాల్సి వస్తోందని.. అయితే కొత్త పద్ధతిలో అలాంటి బెడద లేదని వారంటున్నారు.

  • Loading...

More Telugu News