Chandrababu: ఈరోజు ఎన్నిక పెడితే ఎన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామో, ఎంత మెజార్టీ వస్తుందో చెప్పేస్తా: చంద్రబాబు

  • నాకు ఏం తెలియదని కొందరు అనుకుంటున్నారు
  • ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని విషయాలు నాకు తెలుస్తాయి
  • వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కలబడితే సహించను: చంద్రబాబు

నాయకులు పనితీరు మార్చుకోవాలని, ఈరోజు ఎన్నిక పెడితే ఎన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామో, ఎంత మెజార్టీ వస్తుందో చెబుతానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తమ పార్లమెంటరీ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించాల్సిన బాధ్యత ఆయా లోక్ సభ ఇన్ ఛార్జ్ లదేనని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కలబడితే సహించనని, వారికి భవిష్యత్ లో అవకాశమివ్వనని, పార్టీ ప్రయోజనాలు ముఖ్యమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.

తనకు ఏమీ తెలియదని కొందరు అనుకుంటున్నారని, కానీ, ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తనకు తెలుస్తాయని అన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని, వ్యక్తిగతంగా ఎన్డీఏ, యూపీఏతోనూ విభేదాలు లేవని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్, హజ్ యాత్రకు నిధుల నిలిపివేతపై విభేదించామని చెప్పారు. ఎన్డీఏతో విభేదించినందుకు టీడీపీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధన్యవాదాలు తెలిపారని, సమాజ హితం కోసం సిద్ధాంతపరంగా ఎవరితోనైనా విభేదిస్తామని అన్నారు.

విభజన హామీల అమలుపై ప్రధాని మోదీకి తాను చెప్పాల్సినదంతా చెప్పానని, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లకు సంబంధించి రూ.16 వేల కోట్లు రావాలని అన్నారు. తొలి ఏడాది ఆర్థిక లోటు రూ.16 వేల కోట్లకు రూ.4 వేల కోట్లు ఇచ్చారని, ఇంకా, రూ.7500 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని అన్నారు. 

  • Loading...

More Telugu News