పాదరక్షలు పోగొట్టుకున్న ఉపరాష్ట్రపతి... కాసేపు ఇబ్బందిపడ్డ వెంకయ్యనాయుడు
- బెంగళూరులోని ఎంపీ పీసీ మోహన్ ఇంట్లో పోయిన బూట్లు
- వట్టి కాళ్లతో కాసేపు ఉండాల్సిన పరిస్థితి
- వెంటనే వెళ్లి కొత్త షూస్ కొనుక్కొచ్చిన రక్షణ సిబ్బంది
సమావేశం పూర్తై బయటికొచ్చి చూసేసరికి ఆయన షూస్ కనిపించలేదు. దీంతో వట్టి కాళ్లతోనే కాసేపు అటూ ఇటూ తిరగాల్సి వచ్చింది. ఆయన రక్షణ సిబ్బంది ఎంపీ ఇంట్లో, ఆవరణలో ప్రతి అంగుళం వెతికినప్పటికీ లాభం లేకుండా పోయింది. పొరపాటున ఎవరైనా వేసుకుని వెళ్లి ఉంటారని భావించి, ఇక చేసేది లేక దగ్గరలోని షోరూంకు వెళ్లి కొత్త షూస్ కొనుక్కుని వచ్చారు.