: ఈ జీన్‌తో ఎక్కువ కాలం జీవించొచ్చు


ఇప్పటికే సగటు మనుషుల ఆయు:ప్రమాణం పెరిగిపోయి.. ప్రపంచవ్యాప్తంగా జనాభా రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. అలాంటి సమయంలో మనిషి జీవితకాలాన్ని మరింతగా పెంచే ఒక జీన్‌ను భారతీయ సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త కనుగొన్నారు. వృద్దాప్యాన్ని ఇది వెనక్కు నెడుతుందిట. ఈ జన్యువుకు డోరియన్‌ గ్రే అని పేరుపెట్టారు. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు.

నిజానికి ఈ జన్యువును ఇదివరలో పార్కిన్‌సన్‌ వ్యాధిలోనూ గుర్తించారట. అయితే ఇది ఒక రకం ఈగల్లో 25 శాతం జీవితకాలాన్ని పెంచుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. వీటిమీద పరిశోధనలకు మరింత ఎక్కువ జరిగితే.. వృద్ధాప్య ప్రభావం, వాటికి సంబంధించి.. మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు.

పార్కిన్‌ అని వ్యవహరించే ఈ జన్యువు రెండు విధులు నిర్వర్తిస్తుంది. దెబ్బతిన్న ప్రొటీన్లు విషతుల్యంగా మారకముందే వాటిని తొలగిస్తుంది. కణాల్లోంచి మైటోకాండ్రియాను తొలగించడంలో కీలకంగా ఉంటుంది. పార్కిన్‌ జన్యువు మోతాదును శరీరంలో పెంచడం ద్వారా ఈగలు ఆరోగ్యంగా చురుగ్గా.. సంతాన సాఫల్యంలో దీర్ఘకాలం జీవించినట్లు పరిశోధకుల్లో భారతీయ సంతతికి చెందిన అనిల్‌ రాణా చెప్పారు. ఇది మనుషుల్లో కూడా చక్కగా వర్కవుట్‌ అయితే.. ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు.. ఎక్కువ కాలం పిల్లల్ని కంటూనే ఉండచ్చు కూడా అన్నమాట.

  • Loading...

More Telugu News