ఎయిర్ ఏషియా కొత్త ఆఫర్.. రూ. 1599కే హైదరాబాద్- బెంగళూరు ప్రయాణం!
- అడ్వాన్స్ బుకింగ్స్‌కి మాత్రమే
- మరికొన్ని ప్రత్యేక రూట్లకి కూడా ఆఫర్
- జనవరి 14 వరకు బుకింగ్స్
భువనేశ్వర్-కోల్‌కతా, కొచ్చి-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు మధ్య టికెట్ ప్రారంభ ధర రూ.1599గా ఎయిర్ఏషియా వెల్లడించింది. అలాగే పూణె-బెంగళూరు, భువనేశ్వర్-బెంగళూరు, భువనేశ్వర్-రాంచీ, రాంచీ-కోల్‌కతా, కోల్‌కతా-బగ్డోగ్రా, గోవా-బెంగళూరు, గువహటి-ఇంఫాల్‌ల మధ్య ప్రయాణానికి టికెట్ ప్రారంభ ధర రూ.1899గా ఉంది. రాయితీ ధరలు 2018 మే 6వ తేదీ వరకు ప్రయాణాలకు మాత్రమే వర్తించనున్నాయి. ఈ ఆఫర్ ద్వారా జనవరి 14 వరకు బుకింగ్స్ చేసుకోవచ్చు. కార్డులతో చెల్లింపులకు నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది.