: చిరంజీవిలో గందరగోళం: కోదండరాం


తెలంగాణ రాజకీయ జేఏసీ బస్సు యాత్ర రెండో రోజు మహబూబ్ నగర్ నుంచి ప్రారంభం అయింది. దీనిని జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేతల ఒత్తిడి వల్లే కేంద్ర హోం మంత్రి షిండే తెలంగాణపై సంప్రదింపులంటూ మాట్లాడుతున్నారని అన్నారు. అఖిలపక్షం తర్వాత, సంప్రదింపులు, చర్చలు ఉండవని చెప్పి ఇప్పుడు మాట మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా కోదండరాం కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో చెప్పిన మాటలు ఈ ప్రాంతం వారికి ఇంకా గుర్తున్నాయని చెప్పారు. చిరంజీవి గందరగోళ పరిస్థితిని ఎదొర్కుంటున్నారని అన్నారు. సినిమాలో కథానాయకుడు స్క్రిప్ట్ మరిచిపోతే ఎలా ఉంటుందో, ప్రస్తుతం చిరంజీవి కూడా అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News