Chandrababu: బీసీలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు!: వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి
- బీసీ డిక్లరేషన్ లో ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదు
- బీసీలోని అన్ని కులాలకు న్యాయం చేసేలా వైసీపీ డిక్లరేషన్
- జగన్ ప్రజా సంకల్పయాత్ర .. బీసీ వర్గాలకు భరోసా యాత్ర: జంగా
బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. విజయవాడలో వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన అధికారంలోకి వస్తే బీసీలలోని అన్ని కులాలకు న్యాయం చేస్తారని, ఆ విధంగానే వైసీపీ బీసీ డిక్లరేషన్ ఉంటుందని, జగన్ ప్రజా సంకల్పయాత్ర బీసీ వర్గాలకు భరోసా యాత్రగా సాగుతోందని అన్నారు. బీసీ డిక్లరేషన్ ఎలా ఉండాలనే విషయమై బీసీ మేధావులు, ప్రజాసంఘాల నేతలతో తమ పార్టీ బీసీ అధ్యయన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు.