: 'కోబ్రా' బుసకొట్టింది.. కేంద్రం స్పందించింది
భారత్ లో మనీల్యాండరింగ్ నేరాలపై కన్నేసిన 'కోబ్రాపోస్ట్' ఆన్ లైన్ మ్యాగజైన్ తాజాగా బయటపెట్టిన స్టింగ్ ఆపరేషన్ వివరాలతో కేంద్రంలో చలనం వచ్చింది. మనీల్యాండరింగ్ వ్యవహారంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా సంస్థలకు పాత్ర ఉందని కోబ్రాపోస్ట్ తన స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాలు సంచలనం రేకెత్తించడంతో కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది. తక్షణమే ఆయా బ్యాంకులు, ఎల్ఐసీలో 31 మంది అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.