KCR: ఎస్సీ వర్గీకరణపై తాడోపేడో తేల్చుకుంటాం: టీటీడీపీ, టీకాంగ్రెస్ నేతలు
- విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత సంపత్, టీడీపీ నేత మోత్కుపల్లి
- ఎస్సీ వర్గీకరణ చేసే వరకు కేసీఆర్ ను వదిలిపెట్టం
- కేసీఆర్ దళిత వ్యతిరేకిగా మారారు
ఎస్సీ వర్గీకరణపై తాడోపేడో తేల్చుకుంటామని టీటీడీపీ, టీకాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రేపు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలూ సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని టీకాంగ్రెస్ నేత సంపత్ కుమార్, టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే వరకు కేసీఆర్ ను వదిలిపెట్టమని, కేసీఆర్ దళిత వ్యతిరేకిగా మారారని వారు ఆరోపించారు.
కాగా, ఎస్సీ వర్గీకరణ నిమిత్తం హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని రేపు ముట్టడిస్తున్నట్టు ఏఐఎస్ఎఫ్ నాయకులు కాంపెల్లి శ్రీనివాస్, రెహమాన్ పేర్కొన్న విషయం విదితమే. బీజేపీ అధికారంలోకి వస్తే వందరోజుల్లోనే ‘వర్గీకరణ’ చేస్తామని హామీ ఇచ్చారని, వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ మాటే మరిచారని ఎద్దేవా చేశారు.