pratibhabharathi: మా కుటుంబానికి సంక్రాంతి పండగ అంటే భయమేస్తోంది: కన్నీటి పర్యంతమైన ప్రతిభా భారతి

  • 2015 సంక్రాంతి సమయంలో నా సోదరుడు రాజ్ కుమార్ మృతి చెందాడు
  • ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో అశుభకర వార్తలు వింటున్నా
  • ఈ ఏడాది ఈ విషాదం చోటుచేసుకుంది
  •  కన్నీటి పర్యంతమైన ప్రతిభా భారతి

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ప్రతిభా భారతి మనవడు గొలగాని విఖ్యాత్ అలియాస్ విక్కీ (4) మృతితో ఆమె విషాదంలో మునిగిపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. సంక్రాంతి పండగ అంటేనే తమ కుటుంబానికి భయమేస్తోందని అన్నారు.

ఈ సందర్భంగా 2015 సంక్రాంతి సమయంలో తన సోదరుడు రాజ్ కుమార్ మృతి చెందడం కలచివేసిందని, తమ కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబ వ్యవహారాలను చూసుకునేవాడని, అటువంటి తన సోదరుడిని దేవుడు తమకు దూరం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో ఏదో ఒక అశుభకరమైన వార్తలు వింటున్నామని, ఈ ఏడాది కూడా సంక్రాంతికి ముందు తమ కుటుంబంలో విషాదం చోటుచేసుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News