కేంద్రానికి కోల్ ఇండియాతో కనకవర్షం!
- 2020 నాటికి రూ.95,000 కోట్ల ఆదాయం
- క్లీన్ ఎనర్జీ సెస్సు రూపంలో వసూలు
- ఇప్పటికే రూ.53,967 కోట్ల ఆదాయం
ఈ ఏడాది బొగ్గుపై సెస్సు రూపంలో రూ.26,400 కోట్లు, వచ్చే ఏడాది రూ.30,920 కోట్లు, 2020లో రూ.40,000 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం వసూలు చేయనుంది. కాగ్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లీన్ ఎనర్జీ సెస్సు కింద 2010-11 నుంచి 2016-17 మధ్య రూ.53,967 కోట్లను కోల్ ఇండియా నుంచి వసూలు చేసింది. కేంద్ర సర్కారు గతంలోనే క్లీన్ ఎనర్జీ ఫండ్ ను ఏర్పాటు చేసింది. శుద్ధ ఇంధన టెక్నాలజీలపై పరిశోధనలకు ఇది ప్రోత్సాహం ఇస్తుంది.