Chandrababu: చంద్రబాబు డప్పాలు కొట్టడం తప్పా వెలగబెట్టిందేమీ లేదు: అంబటి రాంబాబు

  • పట్టుమని పది హామీలను కూడా నెరవేర్చని దౌర్భాగ్య పరిస్థితి
  • చంద్రబాబు శ్రమపడింది ప్రజల కోసం కాదు
  • టీడీపీకి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడాలి! 

గత ఎన్నికల్లో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వెలగబెట్టిందేమీ లేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడాలని, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వెలగబెట్టిన ఒక్క కార్యక్రమం కూడా లేదని విమర్శించారు.

ఆరు వందల వాగ్దానాలు చేసిన చంద్రబాబు, అందులో పట్టుమని పది హామీలను కూడా నెరవేర్చని దౌర్భాగ్య పరిస్థితి వుందని మండిపడ్డారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని, కాకపోతే, మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు డప్పాలు కొడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు శ్రమపడింది ప్రజల కోసం కాదని, తన కుమారుడు లోకేశ్ కోసమని, అతన్ని సీఎం చేయాలని ప్రయత్నిస్తున్నారని అంబటి విమర్శించారు.

  • Loading...

More Telugu News