: అరుణ హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్


ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్ కు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.  హైదరాబాద్ లోని వుప్పుగూడ రాజీవ్ గాంధి నగర్లో డిసెంబర్ 31న అరుణ హత్య వెలుగు చూసింది. అప్పటికే శివకుమార్ మహారాష్ట్రకు పారిపోయాడు.  పోలీసులు అతడిని నగరానికి తీసుకు వస్తుండగా పుణే సమీపంలో రైల్లోంచి దూకాడు. దాంతో తీవ్ర గాయాల పాలైన శివకుమార్ కు వైద్యులు కాలు చేయి తొలగించారు. చికిత్స తర్వాత ఈ రోజు అతడిని అరుణ హత్య కేసులో పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. 

  • Loading...

More Telugu News