Telugudesam: టీడీపీలో చేరనున్న వైసీపీ నేత.. సీఎం చంద్రబాబును కలిసిన 'కుప్పం' సుబ్రహ్మణ్యంరెడ్డి!
- చిత్తూరు జడ్పీ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యంరెడ్డి
- సీఎం క్యాంపు కార్యాలయంలో బాబుతో భేటీ
- త్వరలోనే టీడీపీలో చేరతానని చెప్పిన వైసీపీ నేత
చిత్తూరు జడ్పీ మాజీ చైర్మన్, వైసీపీ నేత సుబ్రహ్మణ్యంరెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిశారు. త్వరలోనే భారీ ఎత్తున తన అనుచర వర్గంతో కలిసి టీడీపీలో చేరుతానని చంద్రబాబుతో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా, కుప్పంలో చంద్రబాబుపై సుబ్రహ్మణ్యంరెడ్డి మూడుసార్లు పోటీ చేశారు. ఇదిలా ఉండగా, మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ బాట పట్టడం తెలిసిందే. తాజాగా, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకత్వం కూడా అదే బాటపట్టడం గమనార్హం.