KCR: నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్
- ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలి
- కొత్త సంవత్సరంలో విజయవంతంగా ముందుకు సాగాలి: కేసీఆర్
- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలి: వైఎస్ జగన్
తెలంగాణ ప్రజలకు 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ కొత్త సంవత్సరంలోనూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
కాగా, వైసీపీ అధినేత జగన్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు కలగాలని, తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని జగన్ కోరుకున్నారు.