స్కూలు ఫీజు ఏటా 10 శాతం పెంపు... నెలన్నర ఆలస్యమైతే టీసీ: కలకలం రేపుతున్న తిరుపతిరావు కమిటీ రిపోర్టు
- 10 శాతానికి మించి కూడా ఫీజు పెంచే చాన్స్
- ప్రభుత్వ అనుమతి తీసుకుంటే చాలన్న కమిటీ
- ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు తలొగ్గే నివేదిక
- మండిపడుతున్న పేరెంట్స్ అసోసియేషన్లు
దాదాపు 9 నెలలుగా పలు విద్యాసంస్థలతో చర్చించిన ఈ కమిటీ చేసిన సిఫార్సులపై పేరెంట్స్ సంఘాలు మండిపడుతున్నాయి. జోనల్ విధానంలో ఫీజు రెగ్యులేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని, స్కూల్స్ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కూడా తిరుపతిరావు తన నివేదికలో ప్రతిపాదించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు తలొగ్గి ఈ నివేదికను తయారు చేసినట్టు ఉందని పేరెంట్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు మండిపడుతున్నారు.