: 'రుద్రమదేవి' షూటింగ్ లో బాబా సెహగల్ కు గాయం
భారత సంగీత ప్రియులకు ర్యాప్ పోకడలను పరిచయం చేసిన తొలి గాయకుడు బాబా సెహగల్. తెలుగులోనూ పలు హిట్ గీతాలు ఆలపించిన ఈ విలక్షణ గాయకుడు 'రుద్రమదేవి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నెగెటివ్ పాత్రను పోషిస్తున్న బాబా.. స్టంట్ సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా ఈరోజు గాయపడ్డాడు.
పాదంలో వెంట్రుకవాసి పగులు ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందట. ఈ విషయాన్ని బాబా సెహగల్ స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ ఉత్తరాది గాయకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ చారిత్రక చిత్రంలో రానా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.