secularism: లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తాం!: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- లౌకికవాదులు అనేవారు ఎవరు?
- రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించారు
- మరోసారి సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తాం
- అందుకే అధికారంలోకి వచ్చాం
తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తుందని కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము అందుకే అధికారంలోకి వచ్చామని కూడా ఆయన అన్నారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెక్యులరిస్టులం అని చెప్పుకోవడానికి భారత రాజ్యాంగం ప్రజలకు అనుమతి ఇచ్చిందని, కానీ, అసలు లౌకికవాదులు అనేవారు ఎవరని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ముస్లింలు, క్రైస్తవులు తమ తమ మతాల్లో ఉన్నందుకు గొప్పగా భావించుకోవచ్చని, లౌకికవాదులకు తల్లిదండ్రులు లేరని అన్నారు. అనంత్‌కుమార్ హెగ్డే గతంలోనూ ఇటువంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లోకెక్కారు.