Chandrababu: చంద్రబాబునాయుడొక్కడే ప్రతినిధా?: నందిని సిధారెడ్డి

  • ముఖ్యమంత్రులను పిలిచే సంప్రదాయం లేదు
  • హైదరాబాద్ లో మహాసభలు జరిగాయి కనుక ఇక్కడి ముఖ్యమంత్రి వచ్చారు
  • భాషకు నిజమైన సేవ చేసే వాళ్లందరూ వచ్చారు: సిధారెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లేకుండా నిర్వహించిన మహాసభలకు ప్రపంచ తెలుగు మహాసభలు అని కాకుండా తెలంగాణ మహాసభలు అని పేరు పెడితే బాగుండేది అనే ప్రశ్నకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తన దైన శైలిలో స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడొక్కడే ప్రతినిధా? మేము అనుకున్నదేంటంటే, రాజకీయాలకు చెందిన వ్యక్తుల కంటే సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమని అనుకున్నాం. భాషను బతికించడంలో రచయితలు, కవులు, సాహిత్యం కీలకం’ అని చెప్పుకొచ్చారు.

భాషకు నిజమైనటువంటి సేవ ఎవరు చేస్తున్నారో వాళ్లంతా వచ్చారు. పాలకులు రాకపోవచ్చు. పాలకులకు రాజకీయాలు ఉంటాయి. అసలు ముఖ్యమంత్రులను పిలిచే సంప్రదాయం లేదు. అయితే, తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరిగాయి కనుక ఇక్కడి ముఖ్యమంత్రి పాల్గొన్నారు’ అని తెలిపారు.

  • Loading...

More Telugu News