ఆనందంతో ఎగిరి గంతులేసిన అమల: నాగార్జున
- 'హలో' ప్రమోషన్ లో బిజీగా ఉన్న నాగ్
- సినిమా చూసిన అమల ఆనందం ఆపుకోలేకపోయింది
- బెంగాలీ బ్లడ్ కారణంగానే అఖిల్ లో పాట పాడే గుణం
ఇక తన మనవడి సినిమాను తెలుగు రాకున్నా, అమల తల్లి ఇప్పటికే మూడు సార్లు చూసిందని చెప్పారు. ఈ చిత్రాన్ని చూసిన చిరంజీవి, అఖిల్ ను గట్టిగా గుండెలకు హత్తుకుని అభినందించారని, తనకు 'గీతాంజలి', 'శివ' ఉన్నట్టుగానే, అఖిల్ కెరీర్ లో 'హలో' మిగిలిపోతుందని నమ్ముతున్నానని అన్నారు. అఖిల్ లో సగం బెంగాలీ రక్తం ఉందని, ఆ మూలాలే, అఖిల్ తో 'ఏవేవో కలలు కన్నా' పాటను పాడించి వుంటాయని చెప్పారు. ఇక హీరోయిన్ ఎంపికపై మాట్లాడుతూ, ప్రియదర్శన్ కుమార్తె అన్న కారణంగా తీసుకోలేదని, ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ చేసిన తరువాత మాత్రమే ఎంపిక చేశామని తెలిపారు.