హీరో రాజశేఖర్: మంత్రి తలసానిని కలిసిన హీరో రాజశేఖర్ దంపతులు

  • తెలంగాణ సచివాలయంలో తలసానిని కలిసిన రాజశేఖర్, జీవిత
  • శనివారం ‘గరుడవేగ’ 50 రోజుల వేడుక
  • ఈ వేడుకకు హాజరుకావాలని తలసానికి ఆహ్వానం

హీరో రాజశేఖర్ దంపతులు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. తెలంగాణ సచివాలయంలో మంత్రిని రాజశేఖర్, జీవిత ఈరోజు కలిశారు. ‘గరుడవేగ’ 50 రోజుల వేడుకను శనివారం నిర్వహించనున్నామని, ఈ  వేడుకకు రావాలంటూ తలసానిని ఆహ్వానించారు. అనంతరం మీడియాతో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ చిత్రం యాభై రోజుల వేడుకకు తలసానిని ఆహ్వానించేందుకే వచ్చామని, అంతకు మించి వేరే ఏమీ లేదని అన్నారు. కాగా, రాజశేఖర్, జీవితతో కలిసి సెల్ఫీ దిగేందుకు, వారికి కరచాలనం చేసేందుకు అక్కడి సిబ్బంది ఆసక్తి కనబరిచారు.

  • Loading...

More Telugu News