జగన్: జగన్ బర్త్ డే.. ప్రజల మధ్య భారీ కేక్ కట్ చేసిన నేత
- నల్లమడలో కేక్ కట్ చేసిన వైసీపీ అధినేత
- బర్త్ డే విషెస్ చెప్పిన పలువురు నాయకులు, కార్యకర్తలు
- ఏపీలోని వైసీపీ కార్యాలయాల్లో జగన్ పుట్టినరోజు వేడుకలు
ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఓ భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, అనంతపురం జిల్లాలోని నల్లమడ క్రాస్ నుంచి 41వ రోజు ప్రజా సంకల్పయాత్రను జగన్ ప్రారంభించారు. కాగా, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, సూళ్లూరుపేట, తిరుపతితో పాటు ఏపీలోని వైసీపీ కార్యాలయాల్లో జగన్ బర్త్ డే వేడుకలను స్థానిక నాయకులు నిర్వహించారు.