అయోధ్య: దేవుళ్లకు చలేస్తోందని గర్భగుడిలో హీటర్లు.. అభిషేకానికి వేడినీళ్లు!

  • వార్తల్లో కెక్కిన అయోధ్యలోని జానకి ఘాట్ బడాస్థాన్ ఆలయం 
  • దేవుళ్లకీ చలేస్తుందని చెప్పి ఈ ఏర్పాట్లు చేశాం
  • ఆలయ వేదపండితుడు జన్మయ్ షరన్

ఉత్తరాదిలో ఎముకలు కొరికే చలి కారణంగా అక్కడి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి, దేవుళ్ల సంగతి ఏంటి? చలికి వారు కూడా గజగజ వణికిపోతారని భావించి అయోధ్యలోని ఓ ఆలయంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేవుళ్లకు చలేస్తుందని చెప్పి 'జానకి ఘాట్ బడాస్థాన్' ఆలయంలోని గర్భగుడిలో హీటర్లు ఏర్పాటు చేయగా, విగ్రహాలకు అభిషేకం చేసేందుకు వేడినీళ్లు ఉపయోగిస్తున్నారు.

దేవుళ్లకి కూడా చలేస్తుందని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చేశామని ఆలయ వేదపండితుడు జన్మయ్ షరన్ మీడియాకు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం అయోధ్యలోని రామలల్లా విగ్రహానికి నూలు దుస్తులు వేయాలని, ఆలయంలో హీటర్లు పెట్టించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News