రామ్ గోపాల్ వర్మ: కడప గత చరిత్ర తెలుసుకోలేని వాళ్లు అజ్ఞానంలో ఉన్నట్టే!: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

  • సినిమాగా తీయడానికి వీలుపడని కథలను వెబ్ సిరీస్ ద్వారా తీస్తాను
  • కడప ఫ్యాక్షనిజం మీద ఇంటర్ నెట్ లో బోలెడు వ్యాసాలు  
  • ‘కడప’ వెబ్ సిరీస్ చాలా హింసాత్మకంగా ఉంటుంది 

సినిమాగా తీయడానికి వీలుపడని కథలను వివరంగా చెప్పేందుకే వెబ్ సిరీస్ ద్వారా తీస్తున్నానని, ఈ విషయం పలు సార్లు చెప్పానని, ‘రామాయణం అంతా విన్నాక ..’ అన్నట్టుగా, మళ్లీ అదే విషయాన్ని పదేపదే అడుగుతున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.

ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కడపలో దశాబ్దాల కిందట ఏం జరిగిందో తాను తీస్తున్నానని, కడప ఫ్యాక్షనిజం మీద ఇంటర్ నెట్ లో చూస్తే ఎన్నో వ్యాసాలు ఉన్నాయని అన్నారు. కడప గత చరిత్ర తెలుసుకోలేని వాళ్లు అజ్ఞానంలో ఉన్నట్టేనని విమర్శించారు. ‘కడప’ వెబ్ సిరీస్ చాలా హింసాత్మకంగా ఉంటుందని చెబుతున్నాను, అవసరమైన వాళ్లు చూస్తారు, అక్కర్లేని వాళ్లు ఊరుకుంటారని అన్నారు.

  • Loading...

More Telugu News