సోము వీర్రాజు: మిత్రపక్షంతో ఎలా వ్యవహరించాలో టీడీపీకి తెలియడం లేదు: సోము వీర్రాజు

  • తెలుగుదేశం పార్టీపై మరోమారు విమర్శలు
  • కాకినాడలో గెలుపునకు టీడీపీ వక్రభాష్యం చెబుతోంది
  • ఏపీలో ఇసుక, మట్టి మాఫియా పెరిగిపోయింది 

తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిత్ర పక్షంతో ఎలా వ్యవహరించాలో టీడీపీకి తెలియడం లేదని, కాకినాడలో గెలుపునకు టీడీపీ వక్రభాష్యం చెబుతోందని విమర్శించారు. ఏపీలో ఇసుక, మట్టి మాఫియా పెరిగిపోయిందని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. కాగా, టీడీపీపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత రాజేంద్రప్రసాద్ ఆయనపై మొన్న మండిపడటం తెలిసిందే. తాజాగా, సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News