రోజా: ఏపీ మహిళా మంత్రులపై రోజా తీవ్ర వ్యాఖ్యలు!

  • ఏపీలో మహిళలపై దాడులు జరుగుతున్నా స్పందించరే
  • ‘మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?’
  • అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం: ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మహిళలపై దాడులు జరుగుతున్నా ఇక్కడి మహిళా మంత్రులు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ‘మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?’ అంటూ చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.

 కాగా, ఇదే సమావేశంలో పాల్గొన్న మరో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, టీడీపీ నాయకులు ఇసుక, మట్టి గ్రానైట్.. ఇలా దేనినీ వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే..చిత్తూరు జిల్లాలో మూసేసిన విజయ డెయిరీ, షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News