బొత్స సత్యనారాయణ: ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదు: బొత్స సత్యనారాయణ

  • ప్రతిపక్ష పార్టీని అణచివేసేందుకు కుట్రలు
  • జగన్ పై అధికార పార్టీ గోబెల్స్ ప్రచారం
  • రాజన్న రాజ్యాన్ని జగన్ తీసుకువస్తారు 

జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పత్రికల్లో కథనాలు రాయిస్తూ అధికార పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని ఎన్ని కుట్రలు చేసినా చివరికి ప్రజాకోర్టులో మాత్రం చంద్రబాబుకు శిక్ష తప్పదని బొత్స అన్నారు.

రాజన్న రాజ్యాన్ని జగన్ తీసుకువస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని, అందుకు నిదర్శనం ఆయన ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణే అని అన్నారు. విశాఖ జిల్లాలోని పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన ఘటన దారుణమని, సభ్యసమాజం తలదించుకునేట్టుగా ఇది ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News