శశికళను జయలలిత అనుకుని తప్పులో కాలేసిన ఇమ్రాన్ ఖాన్
- శశికళ చనిపోయాక ఆమె ఇంట్లో బంగారం దొరికిందంటూ ట్వీట్
- తప్పులతడకగా ట్వీట్ చేసిన పాకిస్థానీ నాయకుడు
- వెంటనే ట్వీట్ డిలీట్ చేసిన మాజీ క్రికెటర్
శశికళను దక్షిణాది నటిగా ఇమ్రాన్ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే ఇటీవల చనిపోయిందని అన్నారు. నిజానికి జయలలిత చనిపోయి సంవత్సరం దాటింది. అలాగే ఇంట్లో బంగారు నగలు, డబ్బు దొరికాయని పేర్కొంటూ ఏవో పాత బ్యాంకు దొంగతనానికి సంబంధించిన నకిలీ ఫొటోలను షేర్ చేశారు. తర్వాత కాసేపటికి ఈ ట్వీట్‌ను ఆయన డిలీట్ చేశారు. డిలీట్ చేసేలోగా 606 సార్లు ఈ ట్వీట్‌ను నెటిజన్లు రీట్వీట్ చేశారు.