పవన్ కల్యాణ్: ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక ప్రారంభం
- హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో వేడుక ప్రారంభం
- ఇప్పటికే చేరుకున్న పలువురు సినీ ప్రముఖులు
- వచ్చే నెల 10న విడుదల కానున్న ‘అజ్ఞాతవాసి’
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆడియో వేడుక ప్రారంభమైంది. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ప్రారంభమైన ఈ వేడుకకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకను తిలకించేందుకు పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
కాగా, పవన్ కల్యాణ్ నటించిన 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ నటించారు. ప్రధాన పాత్రల్లో సీనియర్ నటి ఖుష్బూ, రావు రమేష్, మురళీశర్మ తదితరులు నటించారు. వచ్చే నెల 10న ‘అజ్ఞాతవాసి’ విడుదల కానుంది.