బోడె ప్రసాద్‌: ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై తేనెటీగల దాడి!

  • ‘స్వచ్ఛ కృష్ణ’ ఆత్మగౌరవ దీక్ష ర్యాలీలో సంఘటన
  • ఒక్కసారిగా ప్రసాద్‌ ను చుట్టుముట్టిన తేనెటీగలు
  • చొక్కా గుండీలు విప్పి విదిలించుకున్న ఎమ్మెల్యే 

కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో, తన చొక్కా గుండీలు విప్పి మరీ, ఆయన తేనెటీగలను విదిలించుకోవాల్సి వచ్చింది. కంకిపాడు మండలం ఈడ్పుగల్లులోని ‘స్వచ్ఛ కృష్ణ’ ఆత్మగౌరవ దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈ సంఘటన జరిగింది. ఈడ్పుగల్లు హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మీటింగ్ నిర్వహించే ప్రదేశానికి చేరుకుంటుందనగా తేనెటీగలు ఆయనను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన తన చొక్కా గుండీలు విప్పి మరీ, వాటిని తరిమికొట్టాల్సి వచ్చింది.   

  • Loading...

More Telugu News