హార్డిక్ పటేల్: గుజరాత్ ప్రజల్లో ఇంకా రాజకీయ చైతన్యం రావాలి: హార్దిక్ పటేల్
- నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు
- సూరత్, రాజ్ కోట్, అహ్మదాబాద్ లో ఈవీఎంల ట్యాంపరింగ్
- విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలి: హార్దిక్ పటేల్
గుజరాత్ ప్రజల్లో ఇంకా రాజకీయ చైతన్యం రావాలని, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని, తమ ఉద్యమం కొనసాగుతుందని పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సూరత్, రాజ్ కోట్, అహ్మదాబాద్ లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై ప్రశ్నించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు.