'అజ్ఞాతవాసి': 'అజ్ఞాతవాసి' కొత్త పోస్టర్.. ‘ట్విట్టర్’లో పోస్ట్ చేసిన నటి ఖుష్బూ
- ఇన్నేళ్లు ఇలాంటి విలువైన పాత్ర కోసం ఎదురుచూశా
- దర్శకుడు త్రివిక్రమ్ కు ధన్యవాదాలు
- పవన్ కల్యాణ్ అద్భుతమైన వ్యక్తి
వచ్చే నెల 10న 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్రను ఖుష్బూ పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన 'అజ్ఞాతవాసి' పోస్టర్లలో ఆమె కనిపించలేదు.
తాజాగా, ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ జతపరిచారు. ఈ పోస్టర్ లో పవన్ కల్యాణ్, ఖుష్బూ ఉన్నారు. ఖుష్బూ కుర్చీలో కూర్చుని వుండగా.. ఆమె వెనుక నిలబడి ఉన్న పవన్ కల్యాణ్ సీరియస్ గా చూస్తూ ఈ పోస్టర్ లో కనిపిస్తారు. ఇన్నేళ్లు ఇలాంటి విలువైన పాత్ర కోసం ఎదురుచూశానని, తనపై నమ్మకంతో ఆ పాత్రకు తనను ఎంపిక చేసిన దర్శకుడు త్రివిక్రమ్ కు ధన్యవాదాలని, పవన్ కల్యాణ్ అద్భుతమైన వ్యక్తి అని ఆ ట్వీట్ లో ఖుష్బూ పేర్కొన్నారు.