: ఎవరీ మిల్లర్..!?


నిన్నటివరకు డేవిడ్ మిల్లర్ పేరు చెబితే అతనెవరు అని తిరిగి ప్రశ్నించేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. ఈ అనామకుడు కాస్తా నేడు ఓ సూపర్ స్టార్. అంతా ఐపీఎల్ మహత్మ్యం అని వేరే చెప్పనక్కర్లేదు. నిన్న రాత్రి మొహాలీలో మిల్లర్ ఆడిన కిల్లర్ ఇన్నింగ్స్ రాయల్ చాలెంజర్స్ ను నివ్వెరపరిచింది. 194 పరుగుల భారీ లక్ష్యం కూడా మిల్లర్ విధ్వంసకర బ్యాటింగ్ ముందు చిన్నబోయింది. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచంలో సరికొత్త స్టార్ గా అవతరించాడీ దక్షిణాఫ్రికా క్రికెటర్.

ఎనిమిది బంతుల తేడాతో అతి తక్కువ బంతుల్లో సెంచరీ రికార్డు మిస్సయిన మిల్లర్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. మిల్లర్ చలవతో పంజాబ్ జట్టు అంతటి పెను లక్ష్యాన్ని సైతం మరో రెండు ఓవర్లు మిగిలుండగానే అందుకుని మురిసిపోయింది. క్రికెట్ ప్రపంచానికి మిల్లర్ కొత్త అయినా, ఈ యువ క్రికెటర్ 17 ఏళ్ళ ప్రాయంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుడి దక్షిణాఫ్రికా జాతీయ జట్టు దిశగా ప్రస్థానం సాగించాడు.

రెండేళ్ళ క్రితం విండీస్ తో టి20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగిడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అనతికాలంలోనే మంచి హిట్టర్ గా పేరుగాంచాడు. పెద్దగా అవకాశాలు రాకున్నా.. ఆడినంతలో ఆకట్టుకోవడం మిల్లర్ ప్రత్యేకత. అదే అతడికి ఐపీఎల్ ద్వారాలు తెరిచింది.

  • Loading...

More Telugu News