సాయిధరమ్ తేజ్: ‘రికార్డులన్నీ నీ చరణాగతం కృష్ణా’ అంటూ సాయిధరమ్ తేజ్ ప్రశంస!

  • 'అజ్ఞాతవాసి' టీజర్ కు ప్రశంసల వర్షం 
  • తాజాగా సాయిధరమ్ తేజ్ కామెంట్ 
  • వచ్చే నెల 10న విడుదల కానున్న చిత్రం 

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం టీజర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం విడుదల చేసిన ఈ టీజర్ పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా, ‘మెగా’ హీరో సాయిధరమ్ తేజ్ స్పందించాడు. ‘స్వాగతం కృష్ణా రికార్డులన్నీ నీ చరణాగతం కృష్ణా..’ అంటూ ప్రశంసలు కురిపించాడు.

కాగా, ‘మధురాపురి సదనా..స్వాగతం కృష్ణా చరణాగతం కృష్ణా...’ అనే పాటతో అజ్ఞాతవాసి టీజర్ మొదలవుతుంది. ఇంకా ఈ సినిమా టీజర్ గురించి ఎవరేమన్నారంటే... ‘'అజ్ఞాతవాసి' సమస్త ప్రేక్షక హృదయ వాసి అయ్యేలా ఉంది! టీజర్ చూస్తేనే సినిమా చూసినంత తృప్తి కలిగింది...ఆల్ ది బెస్ట్’ అని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ‘వావ్, అద్భుతం, కిక్ ఇచ్చింది..పవర్ స్టార్ రచ్చ చేశారు. త్రివిక్రమ్ సార్ చక్కగా తీశారు..’ అని హీరో నితిన్, 'అజ్ఞాతవాసి' టీజర్ అద్భుతంగా ఉంది. నా సోదరుడు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చిత్ర యూనిట్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా’ అని మంచు మనోజ్, ‘మాటలు లేవు..10-01-2018 కోసం ఎదురుచూస్తున్నాం అంతే’ అని రఘు కుంచె కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News