తెలుగు మహాసభలు: తెలుగు మహాసభల ఆహ్వానాన్ని తిరస్కరించిన మహా సహస్రావధాని గరికపాటి!
- ఏపీ సీఎం చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదు
- నేను ఆ మహాసభలకు వెళ్లడం సబబు కాదు
- స్పష్టం చేసిన గరికపాటి నరసింహారావు
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు తిరస్కరించారు. తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని తనను పిలిచారని, అయితే ఏపీ సీఎం చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదని, అటువంటప్పుడు ఆంధ్రాకు చెందిన వాడిగా తాను ఆ మహాసభలకు వెళ్లడం సబబు కాదని అన్నారు. కాగా, తనకు ఆహ్వానం రాకపోయినా ఫరవాలేదని, తెలుగు భాషను అందరూ గౌరవించాలని చంద్రబాబు పేర్కొనడం విదితమే.