ముస్లిం నాయకులు: మా భూముల్ని ఎందుకు తీసుకున్నారని అడిగితే కేసులు పెడతారా?: ‘జనసేన’ను ప్రశ్నించిన ముస్లిం నాయకులు
- ముస్లిం నేతలను దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం తగదు
- జనసేనతో మాకు విభేదాలు లేవు
- ముస్లిం ఐక్య వేదిక నాయకులు
గుంటూరు జిల్లా చినకాకానిలో జనసేన పార్టీ కార్యాలయం స్థల వివాదంపై ఆధారాలతో ముస్లిం ఐక్య వేదిక నాయకులు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ, ముస్లిం నేతలను దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తమ భూముల్ని ఎందుకు తీసుకున్నారని అడిగితే కేసులు పెడతారా? అని ముస్లిం ఐక్య వేదిక నేత జలీల్ ప్రశ్నించారు. జనసేనతో తమకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాగా, కోర్టుకు వెళ్లలేదని యార్లగడ్డ సుబ్బారావు వారసులు అబద్ధం చెప్పారని, సుబ్బారావు సంతకం చేసిన డాక్యుమెంట్లు కోర్టులో ఉన్నాయని వైసీపీ మాజీ నేత గౌతంరెడ్డి పేర్కొన్నారు. పవన్ అవకాశమిస్తే ఆధారాలు అందజేస్తామని అన్నారు.