టీడీపీ: టీడీపీలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల?
- వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నశత్రుచర్ల
- కొంత కాలంగా వైసీపీకి దూరం
- చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్న శత్రుచర్ల?
వైఎస్ రాజశేఖరెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న శత్రుచర్ల చంద్రశేఖరరాజు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వైసీపీ స్థాపించిన తర్వాత విజయనగరం జిల్లాలో ఆ పార్టీకి తొలిసారి మద్దతు తెలిపిన వ్యక్తి ఆయన. అయితే, కొంత కాలంగా వైసీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు.
కురుపాం నియోజకవర్గ పరిధిలో చినమేరంగి కోటలో నిన్న నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి చంద్రశేఖరరాజు హాజరయ్యారు. టీడీపీలో చేరుతున్నట్టు ఆయనే స్వయంగా చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్సీ విజయరామరాజు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడుని కలిసి టీడీపీ కండువా కప్పుకునేందుకు చంద్రశేఖరరాజు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.