రాహుల్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్
- ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వేడుక
- సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు హాజరు
- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నేడు బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు, ప్రియాంకగాంధీ దంపతులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గాంధీ-నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆరో వ్యక్తి రాహుల్. కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కార్యాలయ ప్రాంగణం రాహుల్ చిత్రపటాలతో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి , భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రఘువీరారెడ్డి, జేడీ శీలం, పల్లం రాజు హాజరయ్యారు.