బండ్ల గణేష్: బండ్ల గణేష్ ను అరెస్ట్ చేయాలి.. విజయవాడ పోలీస్ కమిషనర్ కు వైసీపీ మహిళా నేతల ఫిర్యాదు
- రోజాపై గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
- వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదు
- విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిసిన మహిళా నేతలు
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ను అరెస్ట్ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కు వైసీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే రోజాపై గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని కోరారు. కాగా, ఓ న్యూస్ ఛానెల్ లో ఇటీవల జరిగిన చర్చా కార్యక్రమంలో రోజా, బండ్ల గణేష్ మధ్య మాటలు తీవ్రస్థాయికి వెళ్లడం, పరస్పర దూషణలు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ మహిళా నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.