Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'మంచీ చెడూ' గురించి అనుష్క 
  • 'మెంటల్ మదిలో' దర్శకుని 'బ్రోచేవారెవరురా'!
  • 'ఘాజి' దర్శకుడితో వరుణ్ తేజ్
  • భారీ ఎత్తున విక్రం, సమంతల '10'

*  'ఎక్కడైనా సరే మంచీచెడూ రెండూ వుంటాయి..' అంటోంది అందాలతార అనుష్క. "సినిమా రంగం గురించి బయట రకరకాలుగా మాట్లాడుకుంటారు. అయితే, మంచీ చెడూ అనేవి ఏ రంగంలోనైనా వుంటాయి. ఇక్కడా అంతే, రెండూ వుంటాయి.. మన జాగ్రత్తలో మనం వుండాలి" అని చెప్పింది.      
*  ఇటీవల 'మెంటల్ మదిలో' చిత్రానికి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'బ్రోచేవారెవరురా' పేరిట ఓ క్రైం థ్రిల్లర్ రూపొందనుంది. దీనిని సురేష్ బాబుతో కలసి రాజ్ కందుకూరి నిర్మిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు.
*  రానా హీరోగా ఆమధ్య 'ఘాజి' వంటి కొత్త తరహా చిత్రాన్ని రూపొందించిన సంకల్ప్ రెడ్డి మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తాడని, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని సమాచారం.
*  విక్రం, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన '10 ఎండ్రాట్టుకుల్ల' చిత్రాన్ని '10' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని సుమారు 170 థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News