డీకే భరత సింహారెడ్డి: ఇద్దరిలో ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉంటే చాలన్నది నా ఉద్దేశం!: డీకే భరత సింహారెడ్డి

  • అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చా
  • రాజకీయాలపై నాకు వ్యామోహం లేదు
  • నేను లేదా నా భార్య.. ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉంటే చాలు
  • ఓ ఇంటర్వ్యూలో డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి

తాను, తన భార్య రాజకీయాల్లో ఉండాలనే దానికి తాను వ్యతిరేకమని గద్వాల మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ భర్త  భరత సింహారెడ్డి అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన యూట్యూబ్ ఛానెల్ ‘యోయో టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహిళలకు రాజకీయాల్లో హక్కు ఉండాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తిని తానని, తన భార్య కూడా ఓ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిందని అన్నారు.

తాను అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందే తప్పా, రాజకీయాలపై తనకు వ్యామోహం లేదని చెప్పారు. రాజకీయాల్లోకి రావడం వల్ల వ్యాపారపరంగానే కాకుండా ఆర్థికంగానూ బాగానే దెబ్బతిన్నానని అన్నారు. తనకు తెలిసినంత వరకు ఈ దేశంలో తన సొంత రాజకీయాలను తన భార్యకు లేదా కొడుకులకు అప్పగించే రాజకీయ నాయకులు లేరని అన్నారు. అలాంటి ఆలోచనకు తాను వ్యతిరేకినని, తాను లేదా తన భార్య.. ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉంటారు కదా అనేదే తన ఉద్దేశ్యమని, అదీగాక, ఒక మహిళను రాజకీయాల్లోకి ప్రోత్సహించినట్టు ఉంటుందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News