: 'షారూక్ ను నేటి మ్యాచ్ కు అనుమతించండి'
నేడు ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు షారూక్ ను అనుమతించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసిఎ)ను మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కోరింది. షారూక్ ను వాంకడే స్టేడియంలోకి రాకుండా చూడాలని కోరుతూ ఎంసిఎ స్థానిక చర్చ్ గేట్ పోలీసులను కోరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కమిటీ షారూక్ ను అనుమతించాలంటూ విజ్ఞప్తి చేసింది.
కోల్ కతా నైట్ రైడర్స్ అధినేతగా ఉన్న షారూక్ ను ఐదేళ్ల పాటు ఎంసిఎ కార్యాలయం, వాంకడే స్టేడియంలోకి రాకుండా నిషేధం విధిస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ 2012 మే 18న ఆదేశాలు జారీ చేసింది. పోయినేడాది వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ సందర్భంగా షారూక్ అక్కడి అధికారులు, సెక్యూరిటీ సిబ్బందిపై వాదులాటకు దిగారన్న ఆరోపణతో ఎంసిఎ ఆయనపై నిషేధం విధించింది.