మహేశ్ కత్తి: ‘నువ్వు ఎవరు? ఏంటీ? మీడియాలోకి ఎందుకొచ్చావు?’: ఇంటర్వ్యూలో మహేశ్ కత్తిని ప్రశ్నించిన తమ్మారెడ్డి

  • దళిత కుటుంబానికి, లోయర్ మిడిల్ క్లాస్ కు చెందిన వ్యక్తిని
  • నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉంది
  • ఓ ఇంటర్వ్యూలో మహేశ్ కత్తి

ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఎంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెబుతారో, అడగాల్సిన విషయాన్ని అంతే కచ్చితంగా అడుగుతారు. ఇక, ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి తన విమర్శల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ అడిగిన ప్రశ్నలకు మహేశ్ కత్తి తన గురించిన వివరాలను చెప్పారు.

‘నువ్వు ఎవరు? ఏంటీ? ఎందుకు మీడియాలోకి వచ్చావు? మీ వ్యాపకాలు ఏంటీ?’ అనే ప్రశ్నలకు మహేశ్ కత్తి స్పందిస్తూ, ‘దళిత కుటుంబానికి, లోయర్ మిడిల్ క్లాస్ కు చెందిన వ్యక్తిని. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత టెలివిజన్ లో కొన్నాళ్లు పని చేశాను. నా టెంపర్ మెంట్ కు ఆ జాబ్ సరిపోవట్లేదని చెప్పి, సేవా భావం ఉన్న ఎన్జీవో లో 2001 నుంచి 2013 వరకు పని చేశాను. యునిసెఫ్, వరల్డ్ బ్యాంక్, సేవ్ ది చిల్డ్రన్ సంస్థలన్నింటితో..పిల్లలు, ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన అంశాలపై పని చేశాను.

ఇక నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉంది. దీంతో, సినీ ఇండస్ట్రీలోకి వద్దామనే ఉద్దేశంతో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘నవ తరంగం డాట్ కామ్’లో సినిమాల గురించి ఆర్టికల్స్, రివ్యూలు, ఇండియన్ సినిమాలో ఉన్న ట్రెండ్స్ గురించిన విశ్లేషణలు అప్పటికే రాసేవాడిని. జీవితంలో సినిమా తీయాలనే కోరిక ఉండటంతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను’ అని అన్నారు.

  • Loading...

More Telugu News